Friday, 17 April 2026 09:33:25 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్!!!

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 24 May 2025 08:58 PM Views : 1131

అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / హైదరాబాద్ : అక్షరం ప్రతినిధి హైదరాబాద్ మే 24 తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. జూన్ చివరి వారం లేదా జులై మొదటి వారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడంతో పాటు ప్రభుత్వ పథకాల అమలు వేగవంతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో త్వరలో మరో ఎన్నికల నగరా మోగనుంది.!! అదే స్థానిక సంస్థల ఎన్నికలు. ఎన్నికల తేదీని ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఆశావాహులు మాత్రం వారి ప్రయత్నాలు ప్రారంభించారు. ఓటర్లను ఆకర్షించే కార్యక్రమాలు మొదలుపెట్టారు. మరో నెల, రెండు నెలల్లో నోటిఫికేషన్ వస్తుంది.. అప్పటి వరకు ఆగడం ఎందుకన్నట్లు.. ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఇప్పటికే గ్రామాల్లో.. స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. కొన్ని గ్రామాల్లో అయితే ప్రత్యేక మేనిఫెస్టోలు, సర్పంచ్ పదవుల వేలం పాటలు కూడా నిర్వహిస్తున్నారు అని సమాచారం !! . అయితే ఇప్పటి వరకు ఈ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. తాజాగా సర్పంచ్ ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ముహుర్తం ఫిక్స్ చేసింది. ఆ వివరాలు.. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు.. ఎప్పుడు జరుగుతాయి అనే దానిపై జనాల్లో ఆసక్తి నెలకొని ఉంది. ఎన్నికల తేదీ ఎప్పుడు ఫిక్స్ చేస్తారా అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సర్పంచ్ ఎన్నికలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. జూన్ చివరి వారం లేదా జులై మొదటి వారంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని… రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్రామపంచాయతీల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలు… త్వరగా అమలు కావాలంటే సర్పంచులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో సర్పంచుల పదవి కాలం ముగిసి చాలా కాలం అయినప్పటికీ గ్రామాల్లో సర్పంచ్లకు అధికారులు లేకుండా పోయాయి. దీంతో పాలన ఎక్కడికక్కడ ఆగిపోయిందని తెలుస్తోంది. అందుకే వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించి.. ప్రజలకు మెరుగైన పాలన అందించే దిశగా అడుగులు వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. గతంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం స్థానిక సంస్థల ఎన్నికలపై స్పందించారు. మొదట జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని.. ఆ తర్వాత జూలై చివరి వారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. తాజా సమాచారం ప్రకారం మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుందని సంబంధిత వర్గాల అధికారులు తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చిన తరుణంలో ప్రజలు ఏ వైపుకు మగ్గుచూపుతో వేచి చూడాల్సిందే .

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :