AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఏప్రిల్ 14 అక్షరం న్యూస్ భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని నియోజకవర్గంలోని ఓదెల మండలం కొలనూరు గ్రామంలో తెలుగు ఇన్వెస్టర్ ఎస్ కే యూట్యూబ్ ఛానల్ వ్యవస్థాపకులు అంబటి శ్రావణ్ కుమార్ యాదవ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ సమాజంలో సమానత్వం, విద్య మరియు ప్రాథమిక హక్కుల కోసం అంబేద్కర్ చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కేవలం విగ్రహాలను స్మరించుకోవడమే కాకుండా, ఆయన చూపిన బాటలో నడవడం మనందరి కనీస బాధ్యత అని ఉద్ఘాటించారు. నేటి యువత చదువు,క్రమశిక్షణ మరియు సామాజిక సమానత్వం వంటి విలువలను తమ జీవితాల్లో ఆచరణలో పెట్టినప్పుడే బాబాసాహెబ్‌కు మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని వారు పిలుపునిచ్చారు.జై భీమ్ నినాదాల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో మాటూరి ఉపేందర్,పల్లె సుమన్,పల్లె సతీష్,బెజ్జాల రమేష్,చేనిగరపు నాగరాజు,తదితరులు పాల్గొని అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు.
.
Aksharam Telugu Daily