AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్ : . హైదరాబాద్ / జనవరి 7 / అక్షరం న్యూస్ -: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలను మరియు సుజాతనగర్ మండలం లోని 7 గ్రామ పంచాయితీలను కలిపి కొత్తగూడెం మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు చేయటాన్ని చాలెంజ్ చేస్తూ ప్రముఖ న్యాయవాది జలసూత్రం శివరాం ప్రసాద్ తెలంగాణ హైకోర్టులో వేసిన డబ్ల్యూ పి (పిల్) No.60/2025 కేసు లో బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ సారధ్యంలోని డివిజన్ బెంచ్ ముందు వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉన్నందున స్టే ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ బలంగా వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున కౌంటర్ వేస్తామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ సమయం అడగగా ఈ నెల 21 లోగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. అదే విధంగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వ కౌంటర్ కు సమాధానం దాఖలు చేయటానికి పిటిషనర్ కు రెండు రోజుల సమయం ఇచ్చింది. తదుపరి ఈ నెల 27 వ తేదీన తుది వాదనలు వింటామని ఉన్నత ధర్మాసన న్యాయ మూర్తి చెప్పారు. ఈ లోగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని అట్టి సందర్భంలో తమ కేసు నిరర్ధకం అవుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించగా తమ అధికారాలు ఏమిటో తమకు తెలుసునని పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు తాము ఏ విధంగా ఆదేశాలు ఇచ్చామో గుర్తుంచుకోవాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
.
Aksharam Telugu Daily