GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : అక్షరం పెద్దపల్లి ఏప్రిల్ 17 సమిష్టిగా ఉండి... సమస్యలపై పోరాడి ఇండ్ల స్థలాలు, ఇండ్లు, అక్రిడిటేషన్ కార్డులుసాధించుకోవాలనీ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి పైడాకుల బిక్షపతి,జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్,జిల్లా ప్రధాన కార్యదర్శి సుంక మహేష్ లు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశానికి జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్ అధ్యక్షత వహించగా బిక్షపతి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు జీతభత్యాలు లేకుండా 24 గంటలు నిద్రాహారాలు మాని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ పనిచేస్తున్నారన్నారు. జర్నలిస్టులు ఆర్థికంగా అభివృద్ధి చెందడం లేదని , జర్నలిస్టు ఆరోగ్య భద్రత లేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు మరణిస్తే వారి కుటుంబానికి మీడియా అకాడమీ నుండి కేవలం లక్ష రూపాయలు మాత్రమే అందించి చేతులు దులుపుకుంటున్నారని ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు . మృతిచెందిన జర్నలిస్టు భార్యకు 5వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు జారీ చేసిన హెల్త్ కార్డులు పనిచేయకుండా పోయాయని పని ఒత్తిడి వలన అనేక మంది జర్నలిస్టులు అనారోగ్యం పాలవుతున్నారనితెలిపారు.జర్నలిస్టులతో పాటు వారి కుటుంబాల ఆరోగ్య పరిస్థితులు గాలిలో దీపంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలికంగా పనిచేస్తుందన్నారు. పాత్రికేయుల అభివృద్ధి, సంక్షేమమే ఏజెండాగా కృషి చేస్తుందన్నారు. సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న ఇండ్లస్థలాలు, అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, రిటైర్డ్ జర్నలిస్టులకు పింఛన్లు, మహిళా జర్నలిస్టులకు రాత్రి పూట రవాణా సౌకర్యం తదితర సమస్యలపై ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు చేస్తూ వినతిపత్రాలు, దరఖాస్తులు ఇస్తూ ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్ల దృష్టికి తెస్తుందన్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల పిల్లలకు కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఫీజు రాయితీ కల్పించడం లేదనీ, కావున అట్టి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కమిటీలలో ఉన్న బాధ్యులు, సభ్యులు యూనియన్ నియమ నిబంధనలకు లోబడి పని చేయాలని, అదే విధంగా బాధ్యతతో వ్యవహరించి స్థానిక జర్నలిస్టుల సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. అందరూ ఐక్యతతో హక్కుల సాధనకు కృషి చేయాలని కోరారు.సమన్వయంతో పని చేసి సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ 2026 నూతన డైరీ నీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుంక మహేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఫణి సుదర్శన్ స్టేట్ కౌన్సిల్ సభ్యులు తిరుపతి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బోయిన వినోద్ కుమార్ జిల్లా కమిటీ మెంబర్ ఇరుకుల వీరేశం కార్యవర్గ సభ్యులు గోపికృష్ణ రామదాసు పల్ల మహేష్ షాబిర్ బాషా శ్రీనివాస్ రెడ్డి మేడి దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily