AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల అక్టోబర్ 12/ అక్షరం న్యూస్/---- చందన్‌బహారా పోలీస్ స్టేషన్ నగరి ప్రాంతం పరిధిలోని ఫార్సియా గ్రామ పరిసర ప్రాంతాల్లోని చుట్టు ప్రక్కల అడవి ప్రాంతంలో ఐఈడి లు అమర్చుతున్నట్లుగా మరియు నక్సిలైట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఇన్పార్మర్ ఇచ్చిన సమాచారం మేరకు ఎస్పీ ధమ్తారి సూరజ్ సింగ్ పరిహర్ ఆదేశాల మేరకు ఎఎస్పీ శైలేంద్ర పాండే నేతృత్వంలో డిఆర్జీ మరియు బీడిఎస్ సంయుక్త పోలీస్ దళాలు నగరి ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ ప్రాంత ఆధిపత్యం కోసం పరిశోధనా సమయంలో పోలీస్ బృందం చందన్ బహారా మార్గంలో డి ఆర్ జి బృందం మరియు బీడిఎస్ డిఎస్ బృందం తనిఖీలు చేస్తుండగా మావోయిస్టులు అమర్చిన 10 కిలోల ఐఈడి కనుక్కోవడం జరిగింది. డిఆర్జి మరియు బీడీఎస్ బృందం అప్రమత్తమై సాంకేతిక నైపుణ్యంతో 10 కిలోల ఐ ఈ డి మందు పాతర ను నిర్వీర్యం చేశారు. రద్దీగా ఉండే ట్రాఫిక్ ప్రాంతంలో నక్సలైట్ కుట్రను భగ్నం చేయడం సత్వర సాహసోపేతమైన చర్యగా మరియు పోలీస్ బలగాలు ఆ ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడడంలో విజయం సాధించారు. అనుమానాస్పదంగా ఏదైనా వస్తువు కానీ లేదా వ్యక్తిగాని కనిపించినట్లయితే సమీపంలోనే ధమ్తారీ పోలీస్ స్టేషన్ కు గానీ లేదా 112 కు డయల్ చేసి సమాచారాన్ని అందించగలరు. అట్టి సమాచారాన్ని అందించినట్లయితే ఎటువంటి చర్యలు జరగకుండా అప్రమత్తమై పెద్ద సంఘటనను నిరోధించగలమని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
.
Aksharam Telugu Daily