AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం చర్ల అక్షరం న్యూస్ జూలై 31--- మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ గొంది ముయ్యన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆదివాసి సంఘాల సమన్వయ కమిటీ జేఏసీ చైర్మన్ పాయం సత్యనారాయణ మాట్లాడుతూ షెడ్యూల్ ప్రాంతాలలో మద్యం షాపుల టెండర్లు విధానము ఆయా పంచాయతీ పరిధిలో గల పార్లమెంటు చట్టం పెస ప్రకారంగా ఒకటి బై మూడవ వంతు కోరం గ్రామ సభలో ఆదివాసీలు ఉండాలని అన్నారు. పార్లమెంటు చట్టానికి వ్యతిరేకంగా తూతూ మంత్రంగా పెస గ్రామసభ పెట్టి అధికారులే గ్రామసభ పూర్తి అయినట్టు తీర్మానాలు చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. అలా తప్పుడు పెస తీర్మానాలు చేస్తే ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. అధికార పార్టీ మంత్రులకు ఎమ్మెల్యేల ఒత్తిడిలకు లోనై పార్లమెంటు చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆదివాసి సంఘాలు చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. చర్ల మేజర్ పంచాయతీ పరిధిలో ఆదివాసి ప్రజలకు ఆర్ ఓ ఎప్ ఆర్ భూమి సమస్య ఉంది. రెవిన్యూ భూమి సమస్య ఉంది. సహజ వనరుల అన్యాక్రాంతం సమస్య ఉంది. ముందుగా వీటిపై ప్రభుత్వం పెస గ్రామసభ నిర్వహించి ఆదివాసులకు ఆర్థిక ఫలాలు పెస పార్లమెంట్ చట్టం1996-98 రూల్స్ 2011 పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో గోండ్వాన సంక్షేమ పరిషత్ వర్క్ ప్రెసిడెంట్ పూనెం వర ప్రసాదు ఆదివాసి విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఇర్ప ప్రకాష్ దొర GSP నాయకులు ఇర్ప అరుణ్ కుమార్ తాటి వెంకటరావు బీరబోయిన శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily