Friday, 17 April 2026 09:42:30 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఖమ్మం జిల్లా కుర్రోడికి అదృష్టం తలుపు తట్టింది..

లాటరీలో ఏకంగా 240 కోట్లు..


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 08 November 2025 08:59 PM Views : 754

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ సత్తుపల్లి/ నవంబర్ 8 (అక్షరంన్యూస్) ఖమ్మం : ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన యువకునికి లాటరీ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది.ఒక్కసారిగా అతను సెలబ్రిటీ అయిపోయాడు.చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నత చదువులు పూర్తి చేసి..ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిన ఆ యువకునికి అదృష్టం లాటరీ రూపంలో వరించింది.తన తల్లి పుట్టిన తేదీ 11 సంఖ్యతో లాటరీ టికెట్ కొన్నాడు.ఆ అదృష్ట సంఖ్య 11 అతని జీవితాన్నే మార్చేసింది.ఏకంగా 240 కోట్ల రూపాయలు లాటరీ తగిలింది.ఏది ఏమైనా అదృష్టం అంటే ఇలా ఉండాలి అని ఆ ఊరి జనాలు చెప్పుకుంటున్నారు. తమ ఊరి వాడికి అబుదాబిలో 240 కోట్లు లాటరీ తగిలిందంటే.. మామూలు అదృష్టం కాదని.. తమకు గర్వంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భీమవరం గ్రామం పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది.భీమవరం గ్రామానికి చెందిన గొల్ల అనిల్ కుమార్ అనే యువకుడు అబుదాబి దేశంలో ఏడాదిన్నరగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.అయితే అక్కడ తన స్నేహితుల సూచనల మేరకు లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.తన తల్లి భూలక్ష్మి పుట్టిన తేదీ 11వ తేదీ కావడంతో.. దాన్నే లక్కీ నంబర్‌గా భావించి లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.ఆ సంఖ్య అతనికి కలిసొచ్చింది. ఏకంగా అదృష్టం కలిసి వచ్చి 240 కోట్ల లాటరీ తగిలింది.తన కుమారుడికి లాటరీ టికెట్ ద్వారా కోట్ల రూపాయలు వచ్చాయంటే తల్లిదండ్రులు నమ్మలేకపోతున్నారు. ఆ దేవుడే తమకు ఈ మేలు చేశాడని ఆనందపడుతున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :