Saturday, 13 June 2026 03:42:27 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఏసీబీ వలకు చిక్కిన మండల సర్వేయర్ ... రైతు నుండి పదివేల రూపాయలు ఫోన్ పే ద్వారా లంచం ... అడ్డంగా దొరికిపోయిన సర్వేయర్

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 12 August 2025 02:13 PM Views : 3103

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి ఆగస్టు 12 అక్షరం న్యూస్; పెద్దపల్లి జిల్లాలో మరో అవినీతి చేప ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఓ రైతు నుండి పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ మండల సర్వేయర్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఓ రైతు ద్వారా ఫోన్ పే నుండి మండల సర్వేయర్ అకౌంట్ కు పదివేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయగా ఏసీబీ అధికారులు వలపన్నీ పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న సర్వేయర్ పెండ్యాల సునీల్ ఫోన్ పే ద్వారా 10 వేలు లంచం తీసుకుంటుండగా బుధవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల విచారణ ప్రారంభించారు. నాగార్జున రెడ్డి అనే రైతు భూమి సర్వే చేసి పంచానమా ఇవ్వడానికి 10 వేలు సర్వేయర్ సునీల్ డిమాండ్ చేయగా సదరు రైతు ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు సర్వే యర్ సునీల్ అకౌంట్ ఫోన్ పే ద్వారా 10000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. ఏసీబీ అధికారులు పకడ్బందీగా పట్టుకున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :