Friday, 17 April 2026 09:36:30 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

శ్రీ సరస్వతీ విద్యా నికేతన్ లో స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 15 August 2025 04:30 PM Views : 583

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల ఆగస్టు 15/అక్షరం న్యూస్/----- మండలంలోని తేగడ గ్రామంలో గల శ్రీ సరస్వతి విద్యానికేతన్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని విద్యార్థినీ విద్యార్థులు సమరయోధుల వేషధారణ ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఒకటో తరగతి చదువుతున్న లశ్రీత భారతమాత వేషధారణ ధరించి సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించాలి ప్రకృతిని ప్రేమించాలి. ఒకప్పుడు అమ్మ చందమామను చూపిస్తూ అన్నం తినిపిస్తే ఇప్పుడు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపించే పరిస్థితి ఏర్పడి రేడియేషన్ కు బలైపోతున్నారు మంటూ చక్కటి సందేశాత్మక ప్రదర్శనను సరళమైన రీతిలో అందరికీ అర్థమయ్యేటట్టు ప్రదర్శించడం జరిగింది. విద్యార్థినీ విద్యార్థుల ప్రదర్శనకు పలువురు ముగ్ధులై పలువురు చిన్నారులను ప్రశంసల జల్లులతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు ఉపాధ్యాయురాలు అరుణ రాజేశ్వరి పూజా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :