Friday, 17 April 2026 09:30:43 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

జిల్లాలోని పరిశ్రమలు,వ్యాపార సముదాయాలు మరియు కాలనీలు,కమ్యూనిటీ లలో సీసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.

బ్యాంకులు, ఏటీఎం ల వద్ద నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 26 July 2025 03:56 PM Views : 552

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా /26 జూలై /అక్షరం న్యూస్ : సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వలన నేరాలను అరికట్టే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ అన్నారు.జిల్లా పరిధిలోని పరిశ్రమలు,వ్యాపార సముదాయాలు,కాలనీలు మరియు ఇండ్ల పరిసరాలలో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.ముఖ్యంగా బ్యాంకులు, ఏటీఎం ల వద్ద సీసి కెమెరాలతో పాటు సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.కాలనీలు,కమ్యూనిటీలలోకి ప్రవేశించే డెలివరీ బాయ్స్ యొక్క వివరాలను నమోదు చేసుకున్న తర్వాత మాత్రమే వారిని అనుమతించాలని తెలిపారు.ఇంటి యజమానులు తమ ఇండ్లలో అద్దెకు నివసించే వ్యక్తుల పూర్తి వివరాలను సేకరించుకొని తమ వద్ద పెట్టుకోవాలని తెలిపారు.దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇండ్లలో విలువైన వస్తువులను ఉంచకూడదని,అదే విధంగా ఇరుగు పొరుగు వారికి,స్థానిక పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు.తమ తమ నివాస ప్రదేశాల్లో అర్ధరాత్రి వేళల్లో ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసువారికి సమాచారం అందించాలని కోరారు.తెల్లవారుజామున ఇండ్ల ముందు వాకిలి శుభ్రం చేసేటప్పుడు,రోడ్లపై వాకింగ్ చేసే సమయాల్లో బంగారు ఆభరణాలను ధరించరాదని సూచించారు.ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని,సీసీ కెమెరాల వల్ల భద్రతా ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు.దొంగతనాల నివారణకు,రోడ్డు ప్రమాదాల్లో వాహనాలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు పోలీసు వారికి ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.జిల్లాలోని ప్రధాన రహదారులు,ముఖ్యమైన ప్రదేశాలలో కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అరికట్టవచ్చని తెలిపారు.పరిశ్రమల యాజమాన్యాలు,వ్యాపారస్తులు మరియు అన్ని వర్గాల ప్రజలు పోలీసు వారికి సహకరించాలని కోరారు.ఇప్పటికే జిల్లాలో నమోదైన చాలా కేసులలో సీసీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకోవడం జరిగిందని అన్నారు.జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలు మరియు కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.నేరాలను ఛేదించడంతోపాటు నియంత్రించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకంగా మారిందని అన్నారు.కావున జిల్లా ప్రజలందరూ పోలీస్ యంత్రాంగానికి సహకరిస్తూ తాము నివసించే ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :