D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/జులై 30 (అక్షరం న్యూస్ ) గంగారం మండలంలోని ఏడు బావులు జలపాతం ఇటీవల కురిసిన వర్షాలకు ఉదృతంగా ప్రవహిస్తున్నందున, గతంలో జరిగిన ప్రాణ నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని జలపాతం వద్ద ఏర్పాటుచేసిన భద్రత చర్యలను ఈరోజు మహబూబాబాద్ డిఎస్పి తిరుపతి రావు మరియు గూడూరు సీఐ వినయ్ కుమార్ పర్యవేక్షించడం జరిగింది ఈ సందర్బంగా సందర్శకులు ఎవరు కూడా జలపాతం వద్దకు రావద్దని డిఎస్పి తిరుపతి రావు తెలియజేయడం జరిగింది. ఈ మేరకు అటవీశాఖ మరియు పోలీస్ శాఖ సిబ్బంది తో గంగారం ఎస్సై కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. జలపాతం సందర్శనకు అనుమతి లేదని, నిబంధనలు అతిక్రమించిన వారికి పై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలియజేయడం జరిగింది.
.
Aksharam Telugu Daily