Saturday, 01 August 2026 08:38:22 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

అక్షరం న్యూస్ ఎఫెక్ట్.... ...హనుమంతుని పేటలో రుణాల గోల్ మాల్ పై సిసికి మెమో జారీ

.


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 30 August 2025 06:13 PM Views : 1124

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి ఆగస్టు 30 అక్షరం న్యూస్; పెద్దపల్లి మండలం హనుమంతుని పేట గ్రామంలో స్వశక్తి సంఘాల రుణాల గోల్మాల్ పై సంబంధిత కమ్యూనిటీ కోఆర్డినేటర్ సిసి సతీష్ పర్యవేక్షణ లోపంపై ఆయనకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి కాళిందినీ మెమో జారీ చేశారు. "స్వశక్తి సంఘాల పేరుతో రుణాలు"ఓ వివో ఏ నిర్వాకం"పేరుతో గత జులై నెల 26వ తేదీన అక్షరం దినపత్రికలో సమగ్ర వార్తా కథనం వెలువడింది. ఈ వార్తకు స్పందించిన జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారిని కాళిందినీ సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం గ్రామంలో ఉన్న వివోఏ కలీం పరిధిలో గల స్వశక్తి సంఘాల బ్యాంకు రుణాలు, లావాదేవీలపై ఆడిట్ అధికారులతో ఆడిట్ నిర్వహించారు. సుమారు 46 లక్షలు వరకు స్వశక్తి సంఘాలకు సంబంధించిన డబ్బులు వివో ఏ కలీం తీసుకున్నట్టు సభ్యులు అధికారులకు తెలియజేశారు. అయితే ఒక నలుగురు ఐదుగురు తప్ప మిగతా వారికి అందుకు సంబంధించిన ఆధారాలు ఏమి లభించలేదని అధికారులు తెలిపారు. ఈ విషయంలో సంబంధిత కమ్యూనిటీ కోఆర్డినేటర్ సతీష్ పర్యవేక్షణ లోపం స్పష్టంగా ఉందని అధికారులు గుర్తించారు. విచారణ అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు సీసీ సతీష్ కు మేమో జారీ చేసినట్టు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి తెలిపారు. ఎవరైతే రుణాలు తీసుకున్నారు వారు విధిగా వాయిదాలను చెల్లించాలని లేనిపక్షంలో శాఖ పరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని డిఆర్డిఓ హెచ్చరించారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :