D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ అక్టోబర్ 29 (అక్షరంన్యూస్) జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. జిల్లాలో రెండు రోజులు గా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నీట మునిగిన రోడ్లను దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ఎవరు కూడా చేపాల వేటాకు వెళ్లవద్దని, పశువుల కాపర్లు చెరువులు, వాగులు దాటవద్దని, యువకులు సెల్ఫీల కోసం నీటి ప్రవాహం వద్దకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. బుధవారం కూడా ఇదే పరిస్థితులు వుండే అవకాశం ఉందని వాతావరణం శాఖ హెచ్చరికల నేపథ్యంలో వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని, పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలన్నారు. అత్యవసర సమయాల్లో డయల్ 100కు, స్ధానిక పోలీసులకు, పోలీస్ కంట్రోల్ సెల్ నెంబర్ 8712659111, కలెక్టర్ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ 1077, సెల్ నెంబరు 9063211298 సమాచారం ఆందిచాలని సూచించారు. ఇప్పటికే చెరువులు, వాగుల వద్ద పోలీస్ పెట్రోలింగ్ పెంచి ప్రమాద హెచ్చరికలను తెలియజేసేలా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. చెరువులు, కుంటల వద్ద నీటి ఉధృతిని దృష్టిలో ఉంచుకొని వంతెనలు, చప్టలపై బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రమాదాల భారీన పడకుండా వాహనాల రాకపోకలను నిషేధించాలని పోలీస్ అధికారులకు సూచించామని తెలిపారు. అదేవిదంగా ఎగువ ప్రాంతంలో అధిక వర్షాల మూలంగా మున్నేరు వరద ఉధృతి పెరిగే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. ప్రజలు కూడా అపప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
.
Aksharam Telugu Daily