Saturday, 13 June 2026 02:28:20 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఆన్‌లైన్ నకిలీ మందులతో ప్రాణాలకే ముప్పు అధ్యక్షుడు :-రవీంద్ర చారి

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 20 May 2026 04:00 PM Views : 174

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మే20(అక్షరం న్యూస్ ) మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంకార్పొరేట్ శక్తులు, ఆన్‌లైన్ కంపెనీలు మెడికల్ మాఫియా.గా మారి, డిస్కౌంట్ల పేరుతో నకిలీ మందులను అంటగడుతూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాయి" అని కొత్తగూడ మండల మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు కట్టుకోజు రవీంద్ర చారి ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్త బంద్‌లో భాగంగా బుధవారం మండలంలో మెడికల్ షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు.​ఈ సందర్భంగా రవీంద్ర చారి మాట్లాడుతూ... నాడు కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలకు తెగించి, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ ఎంతో మంది ప్రాణాలు కాపాడింది మీ స్థానిక మెడికల్ షాపు వాళ్లే. అర్ధరాత్రి వేళ ప్రాణం మీదికి వస్తే కనురెప్ప వేయకుండా మందులిచ్చి ఆదుకునేది మేమే. దయచేసి ఆన్‌లైన్ జోలికి వెళ్ళకండి, అక్కడ మందులు తెచ్చుకోకండి. ఆ నకిలీ మందులతో మీ ఆరోగ్యాలు పాడుచేసుకోవద్దు. ఆన్‌లైన్ మాయ వల్ల స్థానిక వ్యాపారులు వీధిన పడే పరిస్థితి వస్తోంది. వేలాది కుటుంబాలను రోడ్డున పడేయకుండా స్థానిక వ్యాపారులను కాపాడుకోండి" అని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వెంకట్ నారాయణ చారి, రాజు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :