Friday, 17 April 2026 09:36:29 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

బాల శివప్రసాద్ కు సన్మానం

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 26 June 2025 10:02 AM Views : 804

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా, జూన్ 25 అక్షరం న్యూస్: మండలంలోని గంగారం గ్రామ శ్రీ విరాట్ విశ్వకర్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం జర్నలిస్టు బాలే శివప్రసాద్ ను ఘనంగా సన్మానించారు. ఇటీవల పెద్దపల్లి జిల్లాలో జరిగిన టి యు డబ్ల్యూ జే జిల్లా కమిటీ ఎన్నికల్లో కాల్వ శ్రీరాంపూర్ మండల సూర్య దినపత్రికలో పనిచేస్తున్న జర్నలిస్ట్ శివప్రసాద్ జిల్లా ఉపాధ్యక్షులు గా ఎన్నికైన సందర్భంగా గంగారం గ్రామ విశ్వకర్మ సంక్షేమ సంఘం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా శాలువా కప్పి స్వీట్లు తినిపించి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరే విధంగా జర్నలిస్టులు పనిచేస్తారన్నారు.జర్నలిస్టు వృత్తి సమాజంలో వెలకట్టలేనిదని నిత్యం సమస్యలపై పరితపిస్తూ ప్రజలకు తెలిసే విధంగా కృషి చేస్తారన్నారు. బాలే శివప్రసాద్ సూర్య దినపత్రికలో పనిచేయడం అభినందనీయమని మరిన్ని పదవులు అధిరోహించి సదా ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంక్షేమ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు ధరణి మణికంఠచారి, ఉపాధ్యక్షులు రంగు సదానందం, ప్రధాన కార్యదర్శి పోలోజు శ్రీనివాస్, సహాయ కార్యదర్శి శ్రీరామోజు వెంకటేశ్వర్లు, కార్యదర్శి సేపూరి కనుకాచారి, కోశాధికారి రావుల సంపత్ చారి, గౌరవ సలహాదారులు బొజ్జ వెంకటేశ్వర్లు, ధరణి బిక్షపతి, సభ్యులు మునిగంటి దేవేంద్ర చారి, కందుకూరి రాజన్న, సేపూరి రవీంద్ర చారి, కందుకూరి రవి కిరణ్, సేపూరి సుమన్, రంగు నారాయణ, రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :