GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /జులై -30(అక్షరం న్యూస్ ) ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, వర్షాల కారణంగా విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని, ప్రజల ప్రాణ భద్రతే విద్యుత్ శాఖకు అత్యంత ప్రాధాన్యమని . గృహ వినియోగదారులు, రైతులు, పశువుల కాపరులు, విద్యార్థులు, ప్రజలందరూ విద్యుత్ భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని ముస్తాబాద్ మండల సెస్ డైరెక్టర్ ఒక ప్రకటన లో తెలిపారు.తడిసిన విద్యుత్ స్తంభాలు, స్టే వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, మీటర్ బోర్డులు, తడి గోడలకు ఆనుకుని ఉన్న విద్యుత్ పరికరాలను తాకరాదన్నారు. తెగిపోయిన లేదా వేలాడుతున్న విద్యుత్ తీగలకు దగ్గరగా వెళ్లకుండా, ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడకూడదని సూచించారు. తడి చేతులతో స్విచ్‌లు, ప్లగ్గులు, గీజర్లు, కూలర్లు, మోటార్లు వంటి విద్యుత్ పరికరాలను తాకరాదన్నారు. సెల్‌ఫోన్ ఛార్జింగ్‌లో ఉండగా మాట్లాడకుండా, ముందుగా ఛార్జర్ తొలగించిన తర్వాతే వినియోగించాలని సూచించారురైతులు వ్యవసాయ మోటార్లను ఆన్ చేసే ముందు స్టార్టర్లు, వైర్లు, స్విచ్‌లు సురక్షితంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని తెలిపారు. మోటార్లు, పంపుసెట్లు, జీఐ పైపులు, ఫుట్‌వాల్వ్‌లకు తప్పనిసరిగా ఎర్తింగ్ ఉండాలని చెప్పారు. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఫ్యూజులు మార్చడం, ఏబీ స్విచ్‌లు ఆపరేట్ చేయడం, కాలిన తీగలు సరిచేయడం వంటి పనులు స్వయంగా చేయరాదని హెచ్చరించారుతెగిపోయిన విద్యుత్ తీగలు లేదా ఇతర లోపాలు కనిపిస్తే వాటి వద్దకు వెళ్లకుండా వెంటనే టీజీఎన్‌పీడీసీఎల్ టోల్‌ఫ్రీ నంబర్ 1912కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
.
Aksharam Telugu Daily