D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 5 వైరా ( అక్షరం న్యూస్) వైరా మండల పరిధిలోని లింగనపాలెం, విప్పలమడక, గన్నవరం, గోవిందపురం గ్రామాల్లో యూరియా పంపిణీ చేయడం జరిగింది. పంపిణీ కార్యక్రమం ఉదయం 6 గంటల నుండి ఏఈవోలు ముందస్తుగా గ్రామాలలో యూరియా కూపన్స్ రైతులకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందన్నారు. తదనంతరం వెంటనే రైతులు సొసైటీలో యూరియా తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి మయన్ మంజూఖాన్, వైరా మండల తహసీల్దార్ సిహెచ్ సురేష్ ఎంపీడీఓ బి సక్రియ, వైరా సబ్ ఇన్స్పెక్టర్స్ పుప్పాల రామారావు, పవన్ లు పర్యవేక్షించారు. సోమవారం కూపన్స్ ద్వారా మండలంలో 1400 యూరియా బాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి మాయన్ మంజూఖాన్ తెలియజేశారు. సరిపడనంత ఉన్నదని రైతులు కృత్రిమ కొరతను దయచేసి సృష్టించవద్దని మండల వ్యవసాయ అధికారి కోరారు . అవసరమైన రైతులు మాత్రమే యూరియా తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా సర్పంచులు మేడా హేమి మా చక్రపాణి ,రంగిశెట్టి కళావతి చంగళ పరశురాములు, కారుమంచి యేసు వ్యవసాయ విస్తరణ అధికారులు సైదులు వాసంతి, కీర్తి పంచాయతీ సెక్రటరి లు గ్రామ పాలన అధికారులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily