Friday, 17 April 2026 09:30:43 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఏజెన్సీ హెచ్ఎంలకు ఝలక్ ...! ఏడుగురికి షోకాజ్ నోటీసులు

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 15 July 2025 07:16 PM Views : 728

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ జూలై 15 (అక్షరం న్యూస్) ఏజెన్సీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న పలువురు ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ ఝలక్ ఇచ్చింది. విధుల్లో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణల నేపథ్యంలో కొత్తగూడ మండలానికి చెందిన ఐదుగురు,గంగారం మండలానికి చెందిన ఇద్దరు మొత్తం ఏడుగురు ప్రధానోపాధ్యాయులకు మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రవీందర్ రెడ్డి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వారి పనితీరుపై వివరణ ఇవ్వాలంటూ అధికారిక ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం కొత్తగూడ మండల కేంద్రంలో మండల విద్య శాఖ అధికారి గుమ్మడి లక్ష్మినారాయణ ఓ ప్రకటనలో మాట్లాడుతూ.. పాఠశాలలలో పేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్.ఆర్.ఎస్) ద్వారా విద్యార్థుల హాజరును నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని గుర్తించారు. ఉదయం 10 గంటల సమీక్షలో స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ, సాయంత్రం 4:30 వరకు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.పీ.యూ.పీ.ఎస్ గోపాలపురం, మాసంపల్లి,కార్లాయి,దుర్గారం,ఆదిలక్ష్మీపురం, గంగారం మండలంలో బావురుగొండ,తల్లాగుంపుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా విద్య శాఖ అధికారి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. విద్యార్థుల హాజరు లెక్కలే భవిష్యత్‌కు ఆధారాలని అన్నారు. వాటిలో అలసత్వం తగదన్నారు. డిజిటల్ పద్ధతుల్లో అంకిత భావంతో వ్యవహరించకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వెంటనే రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించి షోకాజ్‌ నోటీసులు జరిచేశారు ఈ చర్యలతో కొత్తగూడ మండలంలోని మిగతా పాఠశాలల్లో సైతం అప్రమత్తత పెరిగింది. ఎప్పుడైనా తనిఖీలు రావచ్చన్న ఉత్కంఠ నెలకొంది. సి.ఆర్.పి లు డీఈఓ కార్యాలయం నుంచి ఆదేశాలపై ఒక్క నిమిషం ఆలస్యం చేసినా ప్రశ్నించే స్థితి వచ్చిందన్న చర్చ టీచర్లలో జరుగుతోంది .

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :