D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్/వైరా అక్టోబర్ 24 (అక్షరంన్యూస్) విద్యార్థినీలు చదువుతోపాటు ధైర్యంగా ముందుకు సాగాలి అని వైరా ఎస్సై పుష్పాల రామారావు అన్నారు, శుక్రవారం వైరా మండలం ముసలమడుగు సమీపంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం రెండో ఎస్ఐ పవన్, కానిస్టేబుల్ జ్యోతిర్మయి తో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై పుష్పాల రామారావు మాట్లాడుతూ విద్యార్థినిలు చాలా ధైర్యంగా ఉండాలని ఏది మంచి ఏది చెడు అనేది గ్రహించాలని మీ ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుందని, మీ చదువు మీ విజ్ఞానాన్ని పెంచడంతోపాటు సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉండడానికి తోడ్పడుతుందన్నారు. ప్రతి విద్యార్థి సోషల్ మీడియా ప్రభావాలకు లోను కావద్దని ముఖ్యంగా సదువుపై దృష్టి సాధించి తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఎవరైనా మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మీ స్నేహితుల పట్ల తప్పుగా ప్రవర్తించిన అలాంటి వారి పట్ల ఎదురు తిరిగి మాట్లాడుతూ ధైర్యంగా పోలీసులకు తోటి విద్యార్థులకు స్నేహితులకు ఉపాధ్యాయులకు వారి సమాచారాన్ని అందించాలన్నారు.ఎవరైనా మీ పట్ల చెడుగా ప్రవర్తిస్తున్నారని తెలిస్తే వెంటనే వారికి పుల్ స్టాప్ పెట్టి విధంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పోలీసులకు సమాచారం అందించాలన్నారు. మహిళల అభ్యున్నత కోసం రక్షణ కోసం తెలంగాణ పోలీస్ షి టిమ్ ను ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది అని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పలు ఉపాధ్యాయులు విద్యార్థినిలు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily