AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల సెప్టెంబర్ 3/ అక్షరం న్యూస్/---- తక్షణమే రైతులకు సరిపడా యూరియ అందుబాటులోకి తేవాలని రైతుల సమస్యలు పట్టించుకొని కాంగ్రెస్ నీ వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓడించాలని బహుజనుల ఆత్మగౌరవం అభివృద్ధికోసం రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న బీఎస్పీ కి అధికారం ఇవ్వాలని మండల కేంద్రంలోని రైతు సహకార భవన్ చర్ల సొసైటీ నూ బహుజన సమాజ్ పార్టీ చర్ల మండల నాయకత్వం సందర్శించడం జరిగింది.రైతులు యూరియ కోసం పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల అధ్యక్షులు కొండా కౌశిక్ మాట్లాడుతూ మట్టినే నమ్ముకుని ఉన్న రైతన్నలు ధాన్యం పండించే క్రమంలో లక్షల రూపాయలను వడ్డీలకు సైతం లెక్కచేయకుండా అప్పులు తెచ్చి తిని తినక ఆరుగాలం కష్టించి ఆ పైసలను తను పండించే పంటపై దార పోస్తారని పంట చేతికి రావడం కోసం ఎరువులను పై మందులను పిచికారి చేస్తేనే తప్పా ఆ పంట చేతికి వచ్చే పరిస్థితి లేదని అయన అన్నారు. మరి అలాంటి సమయంలో రైతన్నలకు (యూరియా) ఎరువు బస్తాలు అందుబాటులో లేకపోవడంతో రైతన్నలు నానా అవస్థలు పడుతున్నారని చెప్పులు అరిగేలా సొసైటీ చుట్టు తిరుగుతున్నారని ఇందుకు కారణం కచ్చితంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వమేనని అయన మండిపడ్డారు. ఇదేనా ప్రజా ప్రభుత్వం అంటే అని ప్రశ్నించారు. రైతే రాజు రైతు లేకపోతే దేశ అభివృద్ధి లేదు అని చెప్పుకునే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సమాధానం చెప్పాలని అన్నారు. పది ఎకరాలు వరి పంట పండించే రైతుకి ఒక్కటే యూరియా బస్తా ఇస్తానని చెప్పడం సిగ్గుచేటని ఇందుకు ప్రభుత్వం సిగ్గు పడాలని ఆయన అన్నారు. ఎరువు బస్తాల కోసం రైతులను ఈ ప్రభుత్వం కాళ్ల చెప్పులు అరిగేలా తిప్పడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. తక్షణమే రైతులకు సరిపడా (యూరియాను) ఇతర ఎరువులను అందుబాటులోకి తెచ్చి రైతన్నలను కాపాడుకోవాలని బహుజన సమాజ్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది ఇలాగే కొనసాగితే భారత రాజ్యాంగానికి లోబడి బాధిత రైతాంగాన్ని మొత్తం పెద్ద ఎత్తున ఐక్యం చేసి ఉద్యమ బాట పడతామని తద్వారా రైతాంగాన్ని కాపాడు కుంటామని ఆయన తెలిపారు. రైతుల పట్ల రైతుల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఏమాత్రం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీలను రానున్న స్థానిక ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని అయన పిలుపునిచ్చారు. బహుజనుల ఆత్మగౌరవం, రైతుల సంక్షేమం కోసం నిరంతరం అహర్నిశలు కష్టపడుతున్న బహుజన సమాజ్ పార్టీని రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ చర్ల మండల కోశాధికారి జహురుద్దీన్, ఈసీ మెంబర్ మడివి నందకిషోర్, సోషల్ మీడియా ఇంచార్జ్ చెన్నం పవన్ కుమార్ బాధిత రైతాంగం పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily