P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి మే 16 (అక్షరం న్యూస్) ఓదెల మండలంలోని కనగర్తి గ్రామంలో రోడ్ ఎక్కిన రైతన్న దాన్యం బస్తాలతో ప్రధాన రహదారిపై వేసి రోడ్డుకు అడ్డంగా కూర్చొని ధర్నా చేశారు ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కోతలు కోసి దాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు దాన్యం తరలించడంలో ఎలాంటి పురోగతి లేదని సెంటర్ ఇన్చార్జిలను అడిగితే వివిధ కారణాల సాకుతో రైతులకు నిద్రలేకుండా చేస్తున్నారని ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేయక రైతులకు అనేకమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయని రైతుల బాధ ఎవరికి కనబడడం లేదని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎన్ని సమస్యలు ఏర్పడుతున్నాయని. కోతలు మొదలైన ఇన్ని రోజులైనా ధాన్యం కొ నడం లేదని . కొనుగోలు ప్రక్రియ పాతదే కదా.. ఎందుకు ఇన్ని ఇబ్బందులని అసలు వడ్లు ప్రభుత్వం కొంటుందా.. మిల్లర్లు కొంటున్నారా? రైతులపై ఎందుకీ వివక్ష అంటూ మండిపడ్డారు ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చి చేస్తున్నదేమి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా మిల్లర్లకు ఇంటర్‌నేషనల్ నిబంధనలు ఏమైనా పెట్టారన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అసలు ప్రభుత్వం కొంటుం దా.. మిల్లర్లు ధాన్యం కొంటున్నారా! కొనుగోలు కేంద్రాల కాడికి అధికారులు వెంట పోలీసులను తీసుకొస్తారని, మా సమస్య చెప్పాలన్న కూడా ఇబ్బందులు కల్పిస్తున్నారని ఆవేదన చెందారు. కాంగ్రెస్ హయాంలో ఇలా రైతులను ఎందుకు దిగజార్చుతున్నారని, ధాన్యం కొనుగోళ్లలో గతంలో ఎప్పుడు లేనంతంగా నష్టాలను రైతులకు కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పక్షాన ఎవరూ నిలబడటం లేదని, అధికారులు రావడం, ఏదో ఒకటి చెప్పి వెళ్లడం తప్పా ఏ ఏం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి తరలించాలని వర్షాకాలం సమీపిస్తున్న రైతుల్లో ఆందోళన మొదలైందని ఆరుగాలం కష్టపడి పండించడం పంట వర్షానికి ఏమైపోతుందో అన్న భయంతో కొంతమంది అయోమయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున మహిళ రైతులు రైతులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily