AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల సెప్టెంబర్ 9/ అక్షరం న్యూస్/---- తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా గురుదేవ్ విద్యాలయం నందు భాషా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రజా కవి పద్మ విభూషణ్ కాళోజి నారాయణరావు చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు హెచ్ జీ వి ప్రసాద్ అకాడమిక్ కోఆర్డినేటర్స్ ఎంవి సుబ్రహ్మణ్యం జి శ్రీనివాస్ తెలుగు ఉపాధ్యాయ బృందం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా విద్యార్థుని విద్యార్థులు తెలుగు భాష గొప్పదనం ఉట్టిపడేలా చక్కటి పాటలతో అభినయంతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.వేమన సుమతి శతక పద్యాలు అష్టదిగ్గజ కవులుగా అవధాన ప్రక్రియను అద్భుతంగా ప్రదర్శించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల తల్లిదండ్రులు మనసు ను పులకింపజేశాయి.కన్నుల విందుగా ఉన్న విద్యార్థుల ప్రదర్శనకు పలువురు మంత్ర ముగ్ధులై ప్రశంస జల్లులను కురిపించారు.
.
Aksharam Telugu Daily