Saturday, 13 June 2026 03:43:49 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మరోసారి మానవత్వం చాటుకున్న పల్లా కిరణ్.. తీవ్ర అనారోగ్యంతో మరియు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి ఆర్థిక సహాయం & బియ్యం, నిత్యవసర సరుకులు, కూరగాయ

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 11 September 2025 04:07 PM Views : 461

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 11 (అక్షరంన్యూస్) ఖమ్మం నగరంలోని స్థానిక ఎస్పీ ఆఫీస్ రోడ్డు పాత శివాలయం దగ్గరలో నివసిస్తున్న అనిగల సాయి (నిరుద్యోగి) భార్య అనిగల హారికకు కిడ్నీ సమస్య, చర్మ సమస్యలు, కీళ్లవాపులు తదితర అనేక సమస్యలతో గత ఆరు నెలలుగా ఇబ్బందులకు గురవుతున్నది. వారి దంపతులకు సంతానంగా 5 సంవత్సరాల కొడుకు, 11 నెలల కూతురు. అనిగల సాయికి వయసు పైబడిన తల్లి కూడా ఉన్నది. సాయి తన భార్య హారిక చికిత్స నిమిత్తం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ నిత్యం సెలవులు తీసుకుంటున్నాడని ఇటీవలే యాజమాన్యం తనని ఉద్యోగం నుంచి తీసేశారు. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సాయి కుటుంబం పల్లా కిరణ్ ని సంప్రదించగా, పల్లా కిరణ్ యుద్ధ ప్రాతిపదికన వారికి ఆర్థిక సహాయం, బియ్యం, నిత్యవసర సరుకులు, కూరగాయలు అందజేసి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :