Friday, 17 April 2026 09:41:14 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

సమైక్యతా భావం పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యం...పోలీస్ కమిషనర్

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 31 October 2025 11:36 AM Views : 473

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ అక్టోబర్ 30 (అక్షరంన్యూస్) ప్రజల్లో జాతీయ ఐక్యత, సామరస్యం, దేశభక్తి, సమైక్యతా భావం పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యమని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. భారత ఐక్యతా స్ఫూర్తికి ప్రతీక అయిన సర్దార్ వల్లభభాయి పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత దినోత్సవ పరుగు రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు. ముందుగా జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పరుగు కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ జెండా ఊపి ప్రారంభించారు. లాకారం ట్యాంక్ బండ్ నుండి కెఎంసీ స్పోర్ట్స్ గ్రౌండ్ వరకు పరుగు కొనసాగింది. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. సర్దార్ పటేల్ సేవలు, దేశాన్ని ఏక్త బంధంతో కట్టిపడేసిన ఆయన నాయకత్వం ప్రతి ఒక్కరికీ ప్రేరణ అని మనమందరం ఐక్యతతో, స్ఫూర్తితో ముందుకు సాగితేనే దేశ అభివృద్ధి మరింత సాధిస్తుందని అన్నారు. యువత, ప్రజలు, వాకార్స్ అసోసియేషన్, సీనియర్ సిటీజన్స్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమం ద్వారా దేశభక్తి, సమైక్యతా భావం ప్రతి ఒక్కరికి చేరేలా తమ వంతు సహకారం అందించాలి అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ప్రసాద్ రావు, రామానుజం, కుమారస్వామి విజయబాబు, ఏసీపీలు రమణమూర్తి, సుశీల్ సింగ్, నర్సయ్య, డాక్టర్ ప్రదీప్ కుమార్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :