D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ... సత్రం బజారులో గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పువ్వాళ దుర్గాప్రసాద్... ఖమ్మం/ వైరా /సెప్టెంబర్ /4 (అక్షరంన్యూస్) వైరా మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు సత్రం బజార్లో శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 12 అడుగుల విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ దుర్గాప్రసాద్ గణనాధునికి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు వీరితో పాటుగా మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు లయన్స్ క్లబ్ ఫాస్ట్ జిల్లా గవర్నర్ డాక్టర్ కాప మురళీకృష్ణ ఉండ్రు శ్యాంబాబు తోటకూర శ్రీకాంత్ పొదిలి హరినాథ్ అబ్దుల్ సయ్యద్ అన్వర్ పువ్వాళ్ళ రాము ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జరిగిన మహా అన్నదాన కార్యక్రమాన్ని పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ లయన్స్ క్లబ్ కోశాధికారి గద్దె నీరజ పొదిలి హరినాథ్ తోటకూర శ్రీకాంత్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రారంభించారు ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం మహా గొప్పదని గణేష్ మండపాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించటం పట్ల ఉత్సవ కమిటీ వారిని అభినందించారు భక్తులు అన్న ప్రసాదం స్వీకరిస్తే ఎంతో మంచిదని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బోళ్ళ గంగారావు పమ్మి అశోక్ పల్లపు కొండలు ఐ వి నాగేశ్వరరావు వీరశెట్టి సీతారాములు రాచకొండ సాయినాథ్ కుమార్ బాధారు నాగరాజు నంబూరు రామారావు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily