AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / వికారాబాద్ : వికారాబాద్ జిల్లా/ వికారాబాద్ టౌన్ / మార్చ్ 2 / అక్షరం న్యూస్ - : తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల శిక్షణ శిబిరం ను ఫిబ్రవరి 21 నుండి మార్చి 2 వరకు వికారాబాద్ లోని హరిత వ్యాలీలో ఏర్పాటు చేయడం జరిగినది. సోమవారం 2 వ తేదీ ముగింపు కార్యక్రమానికి పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాన్యశ్రీ గౌరవ రాహుల్ గాంధీ రావడం జరిగింది. వారిని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ అయూబ్ కుటుంబ సమేతంగా కలిసినారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అధ్యక్షులను ఉద్దేశించి మాట్లాడుతూ డిసిసి అధ్యక్ష పదవి అనేది ఒక బాధ్యతాయుతమైన పదవి అని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండుకుంటూ అనునిత్యం ప్రజలకై ప్రజా సంక్షేమానికై ప్రజా సమస్యలు తీర్చడంలో ముందు ఉంటూ అభివృద్ధికి దోహదపడాలని అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అండగా నిలవాలని రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలను పాటు పడే వారిని అనునిత్యం ఖండించాలని గాంధీ మార్గంలో నడుచుకుంటూ ప్రజలకు మేలు చేసే విధంగా అధ్యక్షులు ఉండాలని ఆశిస్తున్నాను అని అన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా నిలబడాలని వారితో ప్రేమగా మేలగాలని మహిళలను గౌరవించుకుంటూ వారి అభివృద్ధికి పాటుపడాలని సూచన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిల, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, ఆంధ్రప్రదేశ్ ఇంచార్జి మాణిక్యం ఠాగూర్, మరియు విశ్వనాథన్, సచిన్ సావంత్, ఆంధ్రప్రదేశ్ ఇంచార్జిలు పలక్ వర్మ , తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ డిసిసి అధ్యక్షులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily