Friday, 31 July 2026 09:09:38 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం *పాఠశాలల అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు

ఎమ్మెల్యే. చింతకుంట విజయ రమణారావు


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 16 September 2025 09:36 PM Views : 586

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/కాల్వ శ్రీరాంపూర్ : * కాల్వ శ్రీరాంపూర్/పెద్దపల్లి సెప్టెంబర్ 16 (అక్షరం న్యూస్ ) కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లోమంగళవారం రోజున ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార మహోత్సవం సందర్భంగా 18 మంది ఉత్తమ ఉపాధ్యాయులను పూలమాలలతో సన్మానించి ప్రశంస పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ... గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించి ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసి ప్రైవేటు పాఠశాలలకు వంత పాడింది అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రంలో రూపాయలు పన్నెండు వందల కోట్లు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నారు అన్నారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు ప్రమోషన్లు లేక ఇబ్బంది పడ్డారని ఇరవై ఒక్క వేల మంది ఉపాధ్యాయులకు ఈ ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది అన్నారు. మండలానికి ఎంఈఓ నునియమించి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులకు అదనపు తరగతి గదులకు కోట్లాది రూపాయలు నిధులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది అన్నారు. ఈ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఇప్పటివరకు 10 కోట్ల నిధులు మంజూరి చేయడం జరిగింది అన్నారు. అంగన్వాడి కేంద్రాలలో నర్సరీ, ఎల్.కేజి, యూకేజీ అక్కడే పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు. గోపగోని సారయ్య గౌడ్ గతంలో ఎంపీపీ గా ఉన్నప్పుడు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడమే కాక వారికి తన వంతు ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు అందించి తన వంతు కృషి చేసిన సారయ్య గౌడ్ కు ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే విద్యా సంవత్సరంలో ఒక నెల ముందు మే మాసంలో గ్రామాల్లోని పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు నా వంతు కృషితోపాటు గ్రామాల్లో ఉన్న సారయ్య గౌడ్ తో పాటు మా నాయకులు కృషి చేస్తారని ఉపాధ్యాయులు కూడా తన వంతు సహకారం అందించాలి అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1970 ఉత్తమ ప్రభుత్వ పాఠశాల అని మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాశరావు తో పాటు ఎంతోమంది ఇక్కడే హాస్టల్లో ఉంటూ చదువుకున్నారని నారాయణ, శ్రీ చైతన్య కళ పాఠశాలల కంటే దీటుగా ఈ పాఠశాల నడిచిందని మళ్లీ ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం రావాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరే విధంగా ఉపాధ్యాయులు తమ వంతు కృషి చేయాలని అన్నారు. అనంతరంగోపగోని సారయ్య గౌడ్ మాట్లాడుతూ 2015వ సంవత్సరంలో నేను ఎంపీపీ గా ఉన్నప్పుడు 1098 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి 3 లక్షల రూపాయల విరాళంతో ఆంగ్ల పుస్తకాలు విద్యార్థులకు అందజేశానని అన్నారు. ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి సహాయ సహకారాలు అందిస్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ జగదీశ్వరరావు, ఎంఈఓ సిరిమల్లె మహేష్, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ సబ్బని రాజమౌళి, డైరెక్టర్ ఎన గంటి రవి, హరికృష్ణ గౌడ్, గాజనవేన సదయ్య మరియు మాజీ ప్రజాప్రతినిధులు,నాయకులు మరియు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :