AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం / మార్చ్ 19 / అక్షరం న్యూస్ - : భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారత దేశంలో కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి జీవించి నప్పుడే సమాజం లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని కొత్తగూడెం సింగరేణి కాలరీస్ ఏరియా జనరల్ మేనేజర్ షాలేం రాజ్ అన్నారు. చుంచుపల్లి మండలం రుద్రం పూర్ లోని మస్జీద్ - ఏ- ఖుభా లో జమాతే ఇస్లామి హింద్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు లో పాల్గొని ఆయన మాట్లాడుతూ ఒకరి పండుగలను మరోకరు గౌరవించుకోవాలని అన్నారు. కఠోరమైన ఉపవాసాలు మనిషి లో న్యాయం, ధర్మం, ఆప్యాయత అనురాగాలు పెంపోదిస్తాయని అయన తెలిపారు , ఎవరైతే నీతి నిజాయితీ, నైతికంగా ఉన్నతులో వారే నిజమైన దైవభీతి పరులని అన్నారు. మరో అతిధి యస్. ఓ. టు జి.యమ్ కోటి రెడ్డి మాట్లాడుతూ మతాలు వేరైనా మనమంతా ఒక్కటే అని మంచి మానవతా విలువలు పెంచే కఠోరమైన ఉపవాసాలు పాటిస్తూ దేశ వాసులంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థన చేయాలి అని కోరారు. జమాతే ఇస్లామి హింద్ అధ్యక్షుడు షేఖ్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం రంజాన్ మాసం లో ఉపవాసాలు మనిషి లోని చెడులను దూరం చేసి ఆకలి అంటే ఏమిటో ఆచరణాత్మకంగా తెలుసుకుని సమాజం లోని నిరుపేదలను ఆదుకునే గుణం అలవడుతుంది అని అన్నారు. ఈ మాసంలోనే మానవ జీవిత మర్మాన్ని తెలిపే ఖురాన్ అవతరించింది అని, మంచి చెడుల విచక్షణ తెలిపి ఋజు మార్గం చూపే బోధనలు ఇందులో ఉన్నాయి అని, ఆ బోధనలకు అనుగుణంగా జీవించేలా రంజాన్ ఉపవాసాలు శిక్షణ ఇస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐ యన్ టి యు సి ఏరీయా ఉపాధ్యక్షుడు రజాక్, కరుణాకర్ , రావూరి శంకర్, గూడెల్లి యాకయ్య, షమీం , ఆలం, సోనూ బాయ్, షబ్బీర్, రబ్బానీ, కరీం తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily