P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : ఓదెల/ పెద్దపల్లి ఏప్రిల్ 13 (అక్షరం న్యూస్) భారతరత్న డా. బి.ఆర్. అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా, ఓదెల మండలంలో పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పొత్కపల్లి, గుంపుల, గుడెం, బాయమ్మపల్లి, కొలనూర్ మరియు పొత్కపల్లి పీఎస్ పరిధిలోని అన్ని గ్రామాల్లో ‘అరైవ్-అలైవ్’ రోడ్స్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బీహార్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు ఎస్ ఐ దీకొండ రమేష్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమాలలో గ్రామస్తులకు కీలక ట్రాఫిక్ నియమాలుపై అవగాహన కల్పించారు: ఈ సందర్బంగా ఎస్సై దీకొండ రమేష్ మాట్లాడుతూ, వాహనదారులు రోడ్డు భద్రత తప్పనిసరి పాటించాలని టూ-వీలర్‌లపై హెల్మెట్ తప్పనిసరి వాడాలని అదేవిధంగా (రైడర్, పిల్లర్ ఇద్దరికీ). హెల్మెట్ తప్పనిసరి ఉండాలని కార్/లారీలలో సీట్ బెల్ట్ వాడటం. సురక్షితమని అధిక వేగం నివారణ (హైవేలపై 80-100 కి.మీ. మించరాదని గ్రామీణ రోడ్లపై 40-60 కి.మీ. పరిమితం కావాలని అన్నారు అదేవిధంగా మద్యం సేవించి డ్రైవింగ్ నిషేధం (0.00% టాలరెన్స్). మొబైల్ ఫోన్ ఉపయోగం లేకుండా డ్రైవింగ్. చేయాలని సిగ్నల్స్, ఓవర్‌టేకింగ్, చేయకూడదని వాహనాల మధ్య సురక్షిత దూరం పాటించటం. మంచిగని డిఫెన్సివ్ డ్రైవింగ్ ద్వారా ప్రమాదాల నివారణ. చేయవచ్చని అన్నారు అనంతరం గ్రామస్తులకు సురక్షిత రోడ్డు వాడకం, ప్రమాద నివారణకు వ్యక్తిగత బాధ్యత తీర్చిదిద్దేలా ప్రతిజ్ఞా చేయించారు. ‘అరైవ్-అలైవ్’ ఉద్యమంలో భాగంగా రోడ్డు మరణాలను 30% తగ్గించే లక్ష్యంతో ఓదెల మండల వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమాలలో పోత్కపల్లి సర్పంచ్ అంబాల సారమ్మ గారు గుంపుల సర్పంచ్ ఊరకొండ సమ్మక్క గూడెం సర్పంచ్ చిట్ల రమేష్ బయమ్మపల్లి సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి కొలనూరు సర్పంచ్ పల్లె కనకయ్య ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు అంబేద్కర్ కమిటీ అధ్యక్షులు మరియు సభ్యులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily