D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్/ వైరా/ అక్టోబర్/ 28 (అక్షరంన్యూస్) వైరా కు చెందిన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు షేక్ పాషా బిజెపి తీర్థం తీసుకున్నారు. సోమవారం వైరా పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఖమ్మం జిల్లా బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు కండవాకప్పి పాషాను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బిజెపిజిల్లా అధ్యక్షులు కోటేశ్వరావు మాట్లాడుతూ వైరా కు చెందిన పట్టణ ప్రముఖులు మాజీ వార్డ్ మెంబర్ షేక్ పాషా రాజకీయ కుటుంబం నుంచి వచ్చినవాడని మూడు దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో షేక్ బాబు కుటుంబం రాజకీయాలు ఉంటూ వచ్చిందని ఆస్పూర్తితోనే పాష రాజకీయాల్లోకి వచ్చి రాజకీయంగా సామాజికపరంగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారని తెలంగాణ ఉద్యమంలో జేఏసీగా పాషాపాత్ర మరువలేనిదని అన్నారు. అనంతరం షేక్ పాషామాట్లాడుతూ బిజెపి లో అంకితభావంతో పని చేస్తానని వైరా మండలంలో పార్టీ ప్రతిష్టకు కృషి చేస్తానని అంకితభావంతో పట్టుదలతో క్రమశిక్షణతో పార్టీలో కొనసాగుతానని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి తొండిపు సైదేశ్వర రావు కిసాన్ జిల్లా నాయకులు చింతనిపు రామారావు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily