GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఏప్రిల్ 20 అక్షరం న్యూస్; సామాజిక సేవకుడు, విజ్జన్న యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లం వినోద్ రెడ్డి కుమారుడు అల్లం వినయ్ రెడ్డి 25 వ జన్మదిన వేడుకలు కరీంనగర్లో ని ఓ అనాధాశ్రమంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనాధాశమంలో అల్లం వినోద్ రెడ్డి తమ కుమారుని జన్మదినం పురస్కరించుకొని కేక్ కట్ చేసి అనాధ పిల్లలకు సీట్లు పంపిణీ చేశారు. అనంతరం చికెన్ తో కూడిన భోజనం అనాధ పిల్లలకు అందజేశారు. తన కుమారుడు పుట్టినరోజు సందర్భంగా అనాధాశ్రమంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని అల్లం వినోద్ రెడ్డి పేర్కొన్నారు. సేవ కోసం పరితపించే తాను తన కుమారుడు పుట్టినరోజు సందర్భంగా అనాధల మధ్యల ఈ వేడుకలు నిర్వహించుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.
.
Aksharam Telugu Daily